లక్ష్యం.. 31.95 లక్షల మొక్కలు | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. 31.95 లక్షల మొక్కలు

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో గురువారం నుంచి వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 31.95 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవాన్ని వర్చువల్‌ పద్ధతిలో ఒకేసారి ప్రారంభించనున్నారు. మండల కేంద్రాల్లో ఎంపీడీఓలు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామాల్లో సర్పంచ్‌లు కార్యదర్శులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. కాగా, ఈ ఏడాది జిల్లాలో వన మహోత్సవ లక్ష్యాన్ని తగ్గించారు. గత ఏడాది లక్ష్యం 37,10,100 లక్షలు ఉండగా, ఈసారి 31.95 లక్షల లక్ష్యాన్ని నిర్దేశించారు.

వన మహోత్సవానికి సిద్ధంగా ఉన్న మొక్కలు

అధికారులు లక్ష్యాన్ని పూర్తి చేయాలి

జిల్లాలోని అన్ని శాఖలకు వనమహోత్సవంలో నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలి. అప్పుడే వన మహోత్సవం విజయవంతమవుతుంది. అన్ని గ్రామాలు, మండలాల్లో అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి. – జోజి, జిల్లా అటవీశాఖ అధికారి

శాఖల వారీగా లక్ష్యాలు

వ్యవసాయశాఖ 30,000

డీఆర్డీఓ 18,70,000

విద్యాశాఖ 5000

అటవీశాఖ 6,50,000

ఉద్యాన వనశాఖ 60,000

పరిశ్రమలశాఖ 25,000

నీటి పారుదల శాఖ 22,000

మైనింగ్‌ శాఖ 23,000

పోలీస్‌శాఖ 10,000

ఎకై ్సజ్‌శాఖ 40,000

సీ్త్ర, శిశు సంక్షేమశాఖ 10,000

వీటితోపాటు జిల్లాలోని

4 మున్సిపాలిటీలకు 4,50,000

జిల్లాలో నేటి నుంచి వన మహోత్సవం

వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం

శాఖల వారీగా లక్ష్యాలు నిర్దేశం

గత ఏడాది కంటే తగ్గిన లక్ష్యం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement