వార్షికోత్సవాలకు రండి | - | Sakshi
Sakshi News home page

వార్షికోత్సవాలకు రండి

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

గవర్నర్‌కు బీజేపీ నేతల ఆహ్వానం

నర్సాపూర్‌: నర్సాపూర్‌లోని శ్రీరేణుక ఎల్లమ్మ మాత ఆలయ వార్షికోత్సవానికి రావాలని గవర్నర్‌ శివప్రసాద్‌ శుక్లకు స్థానిక బీజేపీ నాయకులు ఆహ్వాన పత్రికను అందజేశారు. బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్‌గౌడ్‌, పార్టీ అధికార ప్రతినిధి పెద్దరమేష్‌గౌడ్‌, కోశాధికారి ఆంజనేయులుగౌడ్‌ తదితరులు బుధవారం గవర్నర్‌ను కలిశారు.ఈనెల 19, 20 తేదీల్లో జరగనున్న ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. కాగా గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు.

పక్కాగా సర్‌ సర్వే

నర్సాపూర్‌ ఆర్డీఓ రామకృష్ణ

కౌడిపల్లి(నర్సాపూర్‌): సర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) సర్వేను బీఎల్‌ఓలు పక్కాగా చేయాల ని నర్సాపూర్‌ ఆర్‌డీఓ రామకృష్ణ అన్నారు. బుధవారం కౌడిపల్లి రైతువేదికలో నిర్వహించిన బీఎల్‌ఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు సర్‌ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి మరణించిన వారిని, శాశ్వతంగా వలస వెల్లిన వారిని, డూప్లికేట్‌ ఓటర్లను తొలగించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణ, డిప్యూటీ తహసీల్దార్‌ జహీర్‌ తదితరులు పాల్గొన్నారు.

అటవీ భూములు స్వాధీనం

శివ్వంపేట(నర్సాపూర్‌): అటవీ భూములు ఆక్రమించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అటవీ డిప్యూటీ రేంజి అధికారి సిద్దిరాంసింగ్‌, సెక్షన్‌ అధికారి శ్రీధర్‌కుమార్‌ అన్నారు. మండల పరిధిలోని దొంతి బీట్‌ పరిధి జగ్యతండాలో అటవీ భూములు ఆక్రమించుకునేందుకు దున్నకం చేపట్టగా బుధవారం సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. రిజర్వు ఫారెస్ట్‌ భూముల్లోకి వెళ్లకుండా కందకం తవ్వకం చేపట్టినట్లు వారు చెప్పారు. కార్యక్రమంలో బీట్‌ అధికారులు కుమార్‌, శిరీష, హరిత, రజనీ తదితరులు ఉన్నారు.

బడిబస్సులు

భద్రత పాటించాలి

ఎస్పీ శ్రీనివాస్‌రావు

మెదక్‌జోన్‌: ప్రైవేట్‌ పాఠశాల, కళాశాలలకు సంబంధించిన బస్సులు భద్రత ప్రమాణాలను పాటించాలని ఎస్పీ శ్రీనివాస్‌రావు సూచించారు. బుధవారం పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా పాఠశాలల బస్సులను ఫిట్‌నెస్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలను ఉల్లంఘిస్తే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు.

రేపు ‘గోమాత వైభవం’

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు రాక

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని వీఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాలులో ఈ నెల 19న గోమాత వైభవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిద్దిపేట ఉత్సవ కమిటీ నిర్వాహకులు వైద్య కృష్ణమాచార్యులు, మాంకాల నవీన్‌కుమార్‌, గంప శ్రీనులు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రావిచెట్టు హనుమాన్‌ ఆలయ ట్రస్ట్‌ భవనంలో వారు విలేకరులతో మాట్లాడారు. గోమాత వైభవం కార్యక్రమం ధర్మవర్థిని ట్రస్ట్‌, సిద్దిపేట ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరై, గోమాత విశిష్టను తెలుపనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు, కలెక్టర్‌, జిల్లా న్యాయవాది, సీపీ, తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement