అల్పాహారం మరింత ఆలస్యం..! | - | Sakshi
Sakshi News home page

అల్పాహారం మరింత ఆలస్యం..!

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

మెదక్‌జోన్‌: అల్పాహారం పథకానికి ఆదిలోనే బాలారిష్టాలు మొదలయ్యాయి. ఈ పథకం కొన్ని జిల్లాలో ఇప్పటికే ప్రారంభం కాగా, మెదక్‌ జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. రెండు, మూడు నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టాలని సర్కార్‌ నిర్ణయించింది. దీంతో విద్యార్థులను ఆకర్షించడమే కాకుండా.. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకం రూపొందించారు.

మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 903 ప్రభుత్వ పాఠశాలల్లో 73 వేల మంది, అలాగే.. 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 6,500 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టి చదువు చెప్పాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సంగారెడ్డి, హన్మకొండ, సూర్యాపేట సహా ఎనిమిది జిల్లాల్లో మొదటి విడతలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మెదక్‌ జిల్లాలో మాత్రం మూడో విడతలో భాగంగా ఆగస్టు లేదా సెప్టెంబరులో అమలు చేయనున్నట్లు తెలిసింది. అక్షయపాత్ర ఫౌండేషన్‌కు ఈ బాధ్యతలను అప్పగించారు.

కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ప్రారంభం

మెదక్‌జిల్లాకు మాత్రం

అందని మార్గదర్శకాలు

మూడో విడతలో అమలయ్యే అవకాశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement