మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ రాష్ట్ర ఖేల్ కో కన్వీనర్ బండారి ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కొరత, విద్యార్థులకు అవసరమైన సదుపాయాల లేమి వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. అయినా ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో సంతోష్, ఆదర్శ్, అర్జున్, సాయికుమార్, చంద్రశేఖర్ తేజ, వంశీ, శివదత్త, రెడ్డి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను
బలోపేతం చేయాలి
ఏబీవీపీ ఆధ్వర్యంలో
కలెక్టరేట్ ఎదుట ధర్నా


