నర్సాపూర్ రూరల్: ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెరగాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగేళ్లు లోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్చుకోవాలని, నాలుగేళ్లు పైబడిన వారిని ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులతో పాటు నాణ్యమైన విద్య, ఉచిత భోజనం, పుస్తకాలు, రెండు జతల బట్టలు ఇస్తారన్నారు. స్థానిక అధికారులతో పాటు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు విరివిగా చేరెందుకు కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి హేమా భార్గవి, డిఆర్డిఓ పీడీ శ్రీనివాస్ రావు, ఆర్డీఓ రామకష్ణ తాహసిల్దార్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ గుడ్డి పద్మ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


