
ఫలించిన పోరాటం
మెదక్‌జోన్: 2003 డీఎస్సీ టీచర్ల రెండు దశాబ్ధాల పోరాటం ఫలించింది. పాత పెన్షన్ వర్తింపచేయాలని హైకోర్టు తీర్పునివ్వడంతో సంబుర పడుతున్నారు. 2003లో డీఎస్సీలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 800పై చిలుకు అభ్యర్థులు ఎంపికయ్యారు. కానీ అప్పట్లో కామన్ సర్వీస్ రూల్స్‌కు సంబంధించి గవర్నమెంట్, లోకల్‌బాడీ స్కూల్స్ ఒకే గొడుగు కిందకు తేవాలంటూ కోర్టులో కేసు నడవడంతో ప్రభుత్వం 2005 నవంబర్‌లో వీరికి అపాయింట్‌మెంట్ ఇచ్చింది. కాగా 2004లో అప్పటి ప్రభుత్వం పాత పెన్షన్ విధానం రద్దు చేసి నూతన పెన్షన్ విధానం అమలు చేసింది. ఈ నేపథ్యంలో 2005లో ఉద్యోగంలో చేరిన వారు కొత్త పెన్షన్ కిందకు వస్తారని ప్రభుత్వం పేర్కొంది. దీంతో 2003 డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. తమకు న్యాయబద్దంగా పాతపెన్షన్ అమలు చేయాలని కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘకాలంగా హైకోర్టులో ఈ కేసు కొనసాగింది. చివరగా 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని ఇటీవల హైకోర్టు తీర్పునివ్వటంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్
హైకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం
ఉమ్మడి జిల్లాలో 800 పైచిలుకు మందికి మేలు