
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాం
పాపన్నపేట(మెదక్)/హవేళిఘణాపూర్: జిల్లాలో కొత్తగా 9,964 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, వీటి ద్వారా 44,694 మందికి లబ్ధి చేకూరినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని చిత్రియాల్‌లో రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరిందన్నారు. కార్యక్రమంలో ఆరీఓ్డ రమాదేవి, తహసీల్దార్ సతీశ్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్‌నాయక్, మండల నాయకులు ప్రశాంత్‌రెడ్డి, మోహన్, సురేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అలాగే హవేళిఘణాపూర్ మండల పరిధిలోని కూచన్‌పల్లి రైతు వేదికలో పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు పెడుతున్న ఆహారాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు ఉత్తమ విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్