
విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సిబ్బందికి సూచించారు. బుధవారం మెదక్ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ సత్వర పరిష్కారం చూపించాలన్నారు. బాగా పనిచేసే సిబ్బందికి రివార్డ్, అవార్డ్స్, గుర్తింపు ఉంటుందన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, క్రమశిక్షణ సమయపాలన పాటించాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. కష్టపడి పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. అనంతరం స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు, పట్టణంలో నేరాలు, డయల్ 100, బీట్ సిస్టం, పెట్రోలింగ్‌పై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమా ర్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, పట్టణ సీఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు