ప్రణాళికలు సిద్ధం చేయండి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఎఫ్‌ఓ జోజి ఆధ్వర్యంలో శాఖల వారీగా సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాఖల వారీగా 37 లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వ లక్ష్యాలను నిర్ధేశించినట్లు తెలిపారు. వర్షాలు మొదలు కాగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రా రంభించాలన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, అటవీశాఖ సమన్వయంతో వ్యవహరించాలని సూ చించారు. ఏరియాల వారీగా నర్సరీలోని మొక్కలను సంబంధిత శాఖలకు అందజేయాలని డీఆర్డీఓ శ్రీనివాస్‌ను ఆదేశించారు. గతేడాది నాటిన మొక్కలు చనిపోతే వాటిస్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఈనెల 22 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో మొత్తం 5,840 మంది పరీక్ష రాయనున్నారని, ఇందు కోసం జిల్లావ్యాప్తంగా 22 సెంటర్లు ఏర్పాటుచేశామన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు మైనార్టీ వెల్ఫేర్ కళాశాలలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్డీఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, అదనపు ఎస్పీ మహేందర్, ఇంటర్మీడియేట్ అధికారి మా ధవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలు పరిష్కరించండి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులు ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికంగా రెవెన్యూ, భూ సమస్యలు, పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మొత్తం 62 అర్జీలు రాగా, అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం 13, భూ సమస్యలపై 12, రేషన్‌కార్డులు 03, ఇతర సమస్యలపై 34 వచ్చాయి.
వన మహోత్సవంపై కలెక్టర్ సమీక్ష


