అటు ఇటు అయితే.. అంతే!... ఆటో డ్రైవర్ల తీరు మారడం లేదు | - | Sakshi
Sakshi News home page

అటు ఇటు అయితే.. అంతే!... ఆటో డ్రైవర్ల తీరు మారడం లేదు

Jun 22 2023 2:50 AM | Updated on Jun 22 2023 11:23 AM

అల్లాదుర్గం ఐబీ చౌరస్తాలో ఆటో టాప్‌పై కూర్చున్న ప్రయాణికులు - Sakshi

అల్లాదుర్గం ఐబీ చౌరస్తాలో ఆటో టాప్‌పై కూర్చున్న ప్రయాణికులు

అల్లాదుర్గం(మెదక్‌): రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆటో డ్రైవర్ల తీరు మారడం లేదు. ఆటోలో అధికసంఖ్యలో ప్రయాణికులను ఎక్కిస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనలు పాటించకుండా రోడ్లపై దూసుకుపోతున్నారు. అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద ఓ డ్రైవర్‌ ఆటోలో ప్రయాణికులను కిక్కిరిసేలా ఎక్కించుకున్నాడు. అంతటితో ఆగకుండా టాప్‌ పైనా కొందరిని కూర్చోబెట్టుకున్నాడు. కొంచెం అదుపు తప్పినా వారి ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉందని తెలిసినా ఆటోను స్పీడ్‌గా నడుపుకుంటూ వెళ్తూ సాక్షి కెమెరాకు చిక్కాడు.

Advertisement
 
Advertisement
Advertisement