ట్రామా కేర్‌ అవసరం | - | Sakshi
Sakshi News home page

ట్రామా కేర్‌ అవసరం

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

● జాతీయ రహదారులపై నిత్యం ప్రమాదాలు

● కేంద్రం మంజూరైతే సకాలంలో వైద్యం

● ప్రతిపాదనలు పంపిన అధికారులు

ప్రతిపాదనలు పంపాం

రామాయంపేట, నర్సాపూర్‌లో ట్రామా కేర్‌ సెంటర్ల ఏర్పాటు కోసం గతంలోనే ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఇంకా అధికారికంగా మంజూరు రాలేదు. ఈవిషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.

– గణేశ్వర్‌, డీఎంహెచ్‌ఓ

జిల్లాలో 44వ నంబర్‌ జాతీయ రహదారి 55 కిలోమీటర్లు, 765 డీజీ రహదారి 35 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ముఖ్యంగా 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈరోడ్డుపై ప్రతి రోజు పది వేలకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఈరోడ్డుపై ఏ చిన్న ప్రమాదం చోటు చేసుకున్నా మృత్యువులోకి వెళ్లాల్సిందే. జాతీయ రహదారిపై జిల్లా శివారులో ఉన్న రామాయంపేటలో ట్రామాకేర్‌ కేంద్రం మంజూరు చేయిస్తామని గత నాలుగైదేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఇప్పటి వరకు మంజూరు లేదు. ట్రామాకేర్‌ కేంద్రం ఉంటే ప్రమాదాల్లో గాయపడేవారికి సకాలలో అత్యవసర వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది. ఈ కేంద్రంలో 24 గంటలూ ప్రత్యేక వైద్య బృందాలతో పాటు అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంటాయి. నిపుణులైన వైద్య బృందం అందుబాటులో ఉంటుంది. ఆర్థో, న్యూరో, సర్జన్లు అందుబాటులో ఉంటారు. గుండెపోటుకు గురైనవారికి సీపీఆర్‌ చేయడం, ఇతరత్ర చికిత్స కోసం ప్రత్యేక సదుపాయం ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడే వారికి తక్షణమే ఆపరేషన్లు చేయడానికి గాను థియేటర్లు, ఐసీయూ, రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ఎల్లవేళలా అంబులెన్స్‌ సదుపాయం ఉంటుంది.

రెండు కేంద్రాలు మంజూరయ్యే అవకాశం

జిల్లాలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై రామాయంపేట వద్ద, 765డీ జాతీయ రహదారిపై నర్సాపూర్‌ వద్ద ట్రామా కేర్‌ సెంటర్ల ఏర్పాటు కోసం గతంలో వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రాధాన్యతాక్రమంలో ఈరెండు మంజూరయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఈకేంద్రాలు మంజూరైతే సాధ్యమైనంతమేర ప్రమాదాల్లో గాయపడే వారిని రక్షించే అవకాశం ఉంటుదని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా ట్రామా కేంద్రం ఏర్పాటు కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో తగినంత స్థలం అందుబాటులో ఉంది.

రోడ్డు ప్రమాదాల్లో క్షత్రగాత్రులకు సకాలంలో వైద్య సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం జరిగిన గంటలోపు వారికి వైద్యం అందితే ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుంది. జిల్లా పరిధిలో 44, 765 డీజీ జాతీయ రహదారులపై నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయి. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలిస్తున్న క్రమంలో మృత్యువాత పడుతున్నారు.

– రామాయంపేట(మెదక్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement