మెదక్ కలెక్టరేట్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు మెదక్ ఆర్డీఓ డాక్టర్ రమాదేవి తెలిపారు. జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికల్లో మొత్తం 688 మంది ఓటర్లకు గాను 295 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. 42.88 శాతం పో లింగ్ నమోదైనట్లు వెల్లడించారు. పోలైన ఓట్లలో 22 చెల్లని ఓట్లుగా గుర్తించామన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులలో 19 మందిలో 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికై నట్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించినట్లు చెప్పారు. చైర్మన్‌గా మెదక్ పట్టణానికి చెందిన పిల్లల వైద్యుడు తిరుమలేశ్ ఎన్నికయ్యారు.


