వరి వద్దే వద్దు! | - | Sakshi
Sakshi News home page

వరి వద్దే వద్దు!

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

రబీ యాక్షన్‌ ప్లాన్‌ను తిప్పిపంపిన ఉన్నతాధికారులు

సబ్సిడీపై విత్తనాలు

ఎల్‌నినో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యాసంగిలో వరి సాగు వద్దని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే రబీ సీజన్‌కు సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ను జిల్లా అధికారులు సిద్ధం చేసి పంపించారు. అందులో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండగా, దాన్ని వెంటనే రద్దు చేసినట్లు సమాచారం. ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించి, అందుకనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. – మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. గత యాసంగిలో 3.29 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. అందులో 3.5 లక్షల ఎకరాల్లో వరి, మిగితా 24 వేల ఎకరాల్లో కూరగాయల సాగుతో పాటు ఇతర ఆరుతడి పంటలు వేశారు. ఈ వానాకాలం నుంచి ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. ఆరుతడిపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ పెద్దలతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆశాఖ ఉన్నతాధికారులు రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. అయినప్పటికీ 2.94 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించారు, 4 వేల ఎకరాల్లో ఆరుతడి సాగు పెరిగింది.

జిల్లా యంత్రాంగం సమాయత్తం

ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లోనే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రబీకి సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపిస్తారు. ఈసారి 3.30 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానుండగా, అందులో సింహభాగం 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగు కానుందని నివేదిక పంపినట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు ఆ ప్లాన్‌ వెంటనే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నినో ముప్పు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, ఊరూరా రైతులతో విరివిగా సమావేశాలు నిర్వహించి ఆరుతడి సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. దీంతో ఆ దిశగా జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది.

పొంచి ఉన్న ఎల్‌నినో ముప్పు

ఆరుతడి పంటలే మేలని సూచన

అవగాహన కల్పించాలని జిల్లా అధికారులకు ఆదేశం!

ఈ ఏడాది వర్షాకాలంలో సబ్సిడీపై 900 ఎకరాలకు సరిపడా పప్పు దినుసులను రైతులకు అధికారులు పంపిణీ చేశా రు. ఇందులో నర్సాపూర్‌, మనోహరాబాద్‌, నిజాంపేట, శివ్వంపేట, అల్లాదుర్గం, టేక్మాల్‌, పెద్దశంకరంపేట, రేగోడ్‌ తదితర మండలాలకు కందులు, పెసర్లు, మినుములను అందించారు. వీటిలో కొన్ని వందశాతంపై ఇవ్వగా, మరికొన్ని 50 శాతం సబ్సిడీపై అందించారు. ఈ రబీ సీజన్‌లో సైతం సబ్సిడీపై విత్తనాలు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement