రైతులకు పట్టాలివ్వాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు పట్టాలివ్వాలి

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

రైతులకు పట్టాలివ్వాలి నిరుద్యోగులకు ఉచిత కోచింగ్‌

చేగుంట(తూప్రాన్‌): మండలంలోని చిట్టోజిపల్లిలో భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం వ్యవసాయ పొలాలను సందర్శించి మాట్లాడారు. గ్రామంలో భూదాన్‌ బోర్డు పట్టాలు తీసుకున్న 184 మంది రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారికి పట్టాలందించాలని డిమాండ్‌ చేశారు. గ్రామ శివారులోని భూములకు సంబంధించిన రికార్డులు మార్చి ప్రైవేట్‌ పరిశ్రమకు కేటాయించారని ఆరోపించారు. జిల్లాలో 62 వేల ఎకరాల సీలింగ్‌ భూములున్నాయని, వాటిని పేదలకు పంచాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పద్మ, అడివయ్య, గౌరయ్య, మల్లేశం లక్ష్మీనర్సయ్య, రైతులు తలారి నరేశ్‌, మహేశ్‌, రాజు, స్వామి తదితరులు ఉన్నారు.

‘సేవా సేతు’కు

60 దరఖాస్తులు

మెదక్‌ కలెక్టరేట్‌: ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన’ పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్‌శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ బాలస్వామి పిలుపునిచ్చారు. గత మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోని విద్యుత్‌శాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన సేవాసేతు కార్యక్రమం ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలస్వామి హాజరై మాట్లాడారు. మూడు రోజుల్లో 60 దరఖాస్తులు రావడం హర్షనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ తమ తమ ఇళ్లపై రూఫ్‌ టాప్‌ సోలార్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నారాయణనాయక్‌, డీఈ రామేశ్వర్‌, డీటీ టెక్నికల్‌ శ్రీనివాస్‌, ఏడీ మోహన్‌బాబు, ఏఈ నవీన్‌, సోలార్‌ వెండర్‌ దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌ టౌన్‌: నిరుద్యోగ యువత కోసం పట్టణంలో ఉచిత కోచింగ్‌ ప్రారంభిస్తున్నట్లు ఎస్‌ఐ లవకుమార్‌ తెలిపారు. ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతూ.. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 7 తేదీ వరకు పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 10వ తేదీ నుంచి కోచింగ్‌ ప్రారంభిస్తామన్నారు. అభ్యర్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ సైతం ఉచితంగా అందజేస్తామన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement