పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

● గొంతు కోసి హత్య చేసిన దుండగులు

మంచిర్యాలఅర్బన్‌: పుణ్యక్షేత్రాలు, యాత్రలకు మంచిర్యాల డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 3న ఉదయం 5 గంటలకు మంచిర్యాల బస్‌స్టేషన్‌ నుంచి బయలుదేరనున్న బస్సు మానసాదేవి దేవాల యం, కొమురవెల్లి మల్లన్నస్వామి దేవాలయం, జైన దేవా లయం (కొలన్‌పాక), లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం(యాదాద్రి), స్వర్ణగిరి దేవాల యం వరకు రాకపోకలు సాగిస్తుంది. టిక్కెట్‌ ధర రూ.1,300గా ప్రకటించారు. ఈ నెల 10న రెండో యాత్ర ప్యాకేజీ టికెట్‌ ధర రూ. 2,600గా నిర్ణయించారు. 10న ఉదయం 5 గంటలకు మంచిర్యాల బస్‌స్టేషన్‌ నుంచి బ స్సు బయలుదేరి జడ్చర్ల అఖండాలిక దేవా లయం, వనపర్తి రంగనాయకస్వామి, బీచ్‌పల్లి ఆంజనేయస్వామి ఆలయం, అలంపూర్‌ జో గులాంబ, మంత్రాలయం దర్శించుకుని తిరిగి మంచిర్యాలకు చేరుకుంటుంది. ఈ

అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్‌ నరేష్‌కుమార్‌ తెలిపారు. పూర్తి వివరాలకు 9010 44 9575, 9959226004, 8331033700, 99 8 5445438 నంబర్లలో సంప్రదించాలన్నారు.

గంభీరావుపేటలో

దారుణ హత్య

తిర్యాణి: ఇంట్లో నిద్రి స్తున్న వ్యక్తిని గుర్తు తెలి యని దుండగులు గొంతుకోసి హతమార్చిన సంఘటన మండలంలో ని గంభీరావుపేటలో బుఽ దవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాచకొండ సత్తయ్య(50) రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేయగా క్షత్రగాత్రుడు ఇంటి బయటికి వచ్చి కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా ఇటీవల గ్రామంలో ఊరు కట్టడి పనులు చేసేందుకు గ్రామస్తులు రజక కులస్థుల వద్దకు వెళ్లగా పారితోషికం గిట్టుబాటు కాదని ఎవరూ ముందుకు రాలేదు. సత్తయ్య ముందుకు రావడంతో రజక కులస్థులు అతనిపై కక్ష పెంచుకున్నారు. గతంలో పంచాయితీ కూడా పెట్టారు. ఇదే కక్షతో హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతు ని కుమారుడు సాయికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ సంజయ్‌ తెలిపారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

గుడిపేటలో చోరీ

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గుడిపేటలో గురువారం మధ్యాహ్నం చోరీ జరిగింది. గ్రామానికి చెందిన బైరి రమేశ్‌ ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించా రు. నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, కొంతనగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement