జన్నారం: హైదరాబాద్ వారధి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో గత నెలలో నిర్వహించిన వ్యా సరచన, డిబేట్ పోటీల్లో కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబ ర్చి నగదు బహుమతి గెలుపొందారు. ఆన్‌లై న్ ద్వారా నిర్వహించిన డిబేట్ పోటీల్లో కొత్తపెల్లి త్రివేధ, మెండె నందిని, సిలివెరు స్నా జ్ఞశ్రీలు (ద్వితీయ), వ్యాసరచన పోటీల్లో ఆ కుల అనన్య, చెటుపల్లి మోక్షశ్రీ, ధనాలకోట లాస్య తృతీయస్థానంలో నిలిచారు. శనివా రం సినీ హిరో సుమంత్ ఫలితాలు ప్రకటించారు. జూమ్ మీటింగ్‌లో విద్యార్థులతో మా ట్లాడుతూ అభినందించారని పాఠశాల హెచ్‌ఎం గుండ రాజన్న, గైడ్ టీచర్ దాముక కమలాకర్ తెలిపారు. డిబెట్‌లో రూ.27 వేలు, వ్యాసరచనలో రూ.27 వేలు నగదు బహుమ తి, ప్రశంసాపత్రాలు అందుకున్నార ని పేర్కొన్నారు. ఎంఈవో రాజేందర్, సర్పంచ్ వాసల నరేశ్, చైర్మన్ మంగ వారిని అభినందించారు.


