శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల ప్రధాన డిమాండ్ల సాధనలో భాగంగా తాము ఇచ్చిన సమ్మె నోటీసుపై ఇటీవల ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన ఒప్పందాలు అమలు చేస్తామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. శనివారం ఆర్కే 5 గనిపై కార్మికులను కలిసి మాట్లాడారు. సుమారు వందమంది యువ కార్మికులు యూనియన్‌లో చేరగా వారికి సీతారామయ్య కండువా కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచి కార్యదర్శి షేక్ బాజీసైదా, ఉపాధ్యక్షుడు కొట్టే కిషన్‌రావు, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.


