కోటపల్లి: అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తె లిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పారుపల్లి క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. మధ్యాహ్నం వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. 9 పశువులను తరలిస్తున్నట్లు గుర్తించారు. కోటపల్లి మండలం జనగామ నుంచి వాటిని కొనుగోలు చేసి కోరుట్లకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. పశువుల ను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించా రు. డ్రైవర్, యజమాని మొహమ్మద్ ముబీన్ బాబా, వాటిని కొనుగోలు చేసిన కోరుట్లకు చెందిన వ్యాపారి అబ్దుల్ హమీద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


