పీఎంశ్రీలో స్పెషల్‌ టీచర్లు! | - | Sakshi
Sakshi News home page

పీఎంశ్రీలో స్పెషల్‌ టీచర్లు!

Oct 4 2026 8:44 AM | Updated on Oct 4 2026 8:44 AM

● ఉమ్మడి జిల్లాలో 73 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ● ఒక్కొక్కరికి నెలకు రూ.16,500 గౌరవ వేతనం

మంచిర్యాల తెలంగాణ మోడల్‌స్కూల్‌

మంచిర్యాలఅర్బన్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరి ధిలో పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించేందుకు గెస్ట్‌ స్పెషల్‌ నీడ్స్‌ ఎడ్యుకేటెడ్‌ టీచర్లను నియమించనున్నారు. సమగ్రశిక్షా పథకం కింద వారికి నాణ్యమైన విద్య అందించేందుకు తాత్కాలిక పద్ధతిన పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. (నవంబర్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి) వరకు ఐదు నెలల పాటు పనిచేయనున్నా రు. ఈ పోస్టుకు ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.16,500 గౌరవ వేతనం చెల్లిస్తారు. ఒక్కో టీచర్‌ ఐదు నెలల విధులకు గాను రూ. 82,500, ఉమ్మడి జిల్లాలో 73 పోస్టులకుగాను రూ.60,22,500 నిధులు మంజూరయ్యాయి.

పాఠశాలల్లో చేర్పించాలి

ప్రత్యేక అవసరాల పిల్లలు, దివ్యాంగులను టీచర్లు గుర్తించి బడిలో చేర్పించాలి. ప్రత్యేక బోధన పద్ధతులు అమలుచేయడం, వారి పురోగతి తెలుసుకోవడానికి పాఠశాలలు, ఇంటి సందర్శనలు నిర్వహించి పేరెంట్స్‌కు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.

ఉమ్మడి జిల్లా వివరాలు..

జిల్లా పోస్టులు నిధులు మంజూరు

మంచిర్యాల 21 రూ.17,32,500

ఆదిలాబాద్‌ 20 రూ.16,50,000

నిర్మల్‌ 18 రూ.14,85,000

కుమురంభీం 14 రూ.11,55,000

అర్హత ఇలా..

బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పూర్తి చేసి ఉండా లి. బీఈడీ (జనరల్‌)తోపాటు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో ఒక సంవత్సరం డిప్లొమా, బీఎడ్‌తో పాటు ప్రత్యేక విద్యలో రెండేళ్ల డిప్లొమా, ప్ర త్యేక విద్యలో పోసు్ట్రగా డ్యుయేట్‌, ప్రొఫెషనల్‌ డిప్లొమా, దృష్టిలోపంలో సెకండరీ స్థాయి ఉపాధ్యాయ శిక్షణ పొందినవారు అర్హులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement