బెల్లంపల్లి: ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన క్రీడాపోటీల్లో బెల్లంపల్లిలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కాసిపేట బాలుర గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ప్రతిభ కనబర్చి రాష్ట్ర, జోనల్‌స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–14, 17, 19 కేటగిరీలలో జిల్లా, జోనల్‌స్థాయి క్రీడాపోటీలు జరిగాయి. అథ్లెటిక్స్ విభాగంలో జి.కిరణ్, ఎ.మధు, టి.సిద్దార్థ జోనల్ స్థాయికి, డి.చైతన్య (సాఫ్ట్‌బాల్), బి.ఆద్విక్ (చదరంగం), బి.తిరుపతి (హ్యాండ్‌బాల్), ఎ.చైతన్య(కబడ్డీ)లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గురుకులంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్, పీడీ కె.హరీశ్, పీఈటీి ఏ.రాజేందర్, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.


