బంతి, సీతమ్మ పూలు సాగు చేస్తున్న రైతులు వాతావరణం అనుకూలిస్తే అధిక లాభాలు దీపావళి వరకు పూలకు డిమాండ్
చెన్నూర్‌రూరల్: పెళ్లిళ్లకై నా, పండుగలకై నా పూలు ఎంతో అవసరం. పండుగల వేళ పూలు దొరక్కపోవడంతో పట్టణాలకు వెళ్లి అధిక ధరలకు విక్రయిస్తుంటారు. గతంలో గ్రామీణ ప్రాంతాలలో పూలకు కొదువ ఉండేది కాదు. కానీ రైతులు పూల సాగును పూర్తిగా మరిచిపోయి పత్తి, ఇతర పంటలను సాగు చేస్తున్నారు. దీంతో పండుగలకు, పెళ్లిళ్లకు పూలు దొరకడం కష్టంగా మారింది.
మళ్లీ పూల సాగువైపు..
రైతులు మళ్లీ అదనపు ఆదాయం కోసం పంట మా ర్పిడి పద్ధతి అవలంభించి బంతి పూల సాగును ఎంపిక చేసుకుంటున్నారు. బతుకమ్మ పండుగ కోసం రైతులు పూల సాగు చేస్తున్నారు. జూన్ చివరి వా రం, జూలై మొదటి వారంలోనే పూల సాగును ప్రా రంభిస్తారు. మండలంలోని అంగ్రాజ్‌పల్లి, దుగ్నెపల్లి, చింతలపల్లి, సుబ్బరాంపల్లి, నారాయణపూర్, రాయిపేట, సుద్దాల, సుందరసాల, ముత్తరావుపల్లి తదితర గ్రామాలలో బంతి పూలు, సీతమ్మ పూల ను రైతులు సాగు చేస్తున్నారు. పూల తోటలు సాగు చేసేందుకు రైతులు ఎంతగానో శ్రమిస్తారు. వాటికి చీడపీడలు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చీడ, పీడలను గుర్తించి మందులు పిచి కారీ చేయాలి. విత్తనం పెట్టినప్పటి నుంచి పూలు పూచే వరకు వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవా ల్సిందే. సీతమ్మ పూలను సాగు చేసేందుకు భూమి కౌలు, విత్తనాలు, మందులకు మొత్తం రూ.20వేల ఖర్చు వస్తుంది. మార్కెట్‌లో ఒక్కో కట్ట(కిలో) రూ.100 చొప్పున అమ్ముతారు. బతుకమ్మ సీజన్ అయ్యే సరికి సుమారు 35 నుంచి 40 క్వింటాళ్ల వరకు సీతమ్మ పూలు వచ్చే అవకాశం ఉంది. అలా గే బంతి పూల సాగు కోసం రైతులు సుమారు రూ. 10వేల వరకు ఖర్చు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించి చీడపీడలు రాకుండా ఉంటే పూల సా గుకు లాభాలు బాగా ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు. బతుకమ్మ పండుగతో పాటు దీపావళి పండుగ వరకు పూలను అమ్ముతుంటారు.
బంతి, సీతమ్మ పూల సాగు..
గత ఏడాది సీతమ్మ పూలను మాత్రమే సాగు చేశాను. ఈ ఏడు బంతి పూలు, సీతమ్మ పూలు సాగు చేస్తున్నాను. పూలు మంచిగానే పూశాయి. బతుకమ్మలకే కాకుండా ఇతర శుభకార్యాలకు కూడా పూలు అమ్ముతాం. దీపావళి వరకు బంతి పూలకు గిరాకీ ఉంటుంది.
– రమేశ్, రైతు, సుబ్బరాంపల్లి
ఐదు గుంటలలో సాగు..
నాకున్న ఐదు గుంటలలో బంతి పూలు సాగు చేశాను. విత్తనాల కోసం రూ.3వేలు ఖర్చు చేశాను. రూ.3వేలు పురుగు మందులు, ఇతర మందులు స్ప్రే చేశాను. ప్రస్తుతం పూలు బాగానే ఉన్నాయి. వాతావరణం సహకరిస్తే లాభాలు ఉంటాయి.
– బాపు, రైతు, అంగ్రాజ్‌పల్లి
మార్కెటింగ్ సౌకర్యం కరువు..
బతుకమ్మ, దీపావళి పండుగలకు మంచిర్యా ల, గోదావరిఖని, ఇతర ప్రాంతాలలో బంతి పూలు, సీతమ్మ పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఇక్కడ పూలు అమ్మేందుకు మా ర్కెటింగ్ సౌకర్యం లేక పూలు ఎక్కడ అమ్మాలో తెలియక రైతులు తలలు పట్టుకున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ అందజేయడం లేదు. ఎంతో కష్టపడి పండించిన పూలను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అ మ్ముకుందామంటే రవాణా ఛార్జీలు అధికమవుతున్నాయి. దీంతో రైతులు దళారులకు పూ లను విక్రయిస్తున్నారు. ప్రభుత్వం పూల సా గును ప్రాత్సాహించి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని రైతులు పేర్కొంటున్నారు.


