కార్మికులకు లాభాల వాటా 40శాతం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు లాభాల వాటా 40శాతం చెల్లించాలి

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

బెల్లంపల్లి: సింగరేణి కార్మికులకు 2025 –26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి వచ్చిన వాస్తవ వార్షిక లాభాలను వెంటనే ప్రకటించి 40శాతం వాటా ప్రకటించాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) కేంద్రకమిటీ ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటస్వామి, బెల్లంపల్లి బ్రాంచ్‌ కార్యదర్శి దా గం మల్లేశ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం బెల్లంపల్లి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంతో చర్చలు జరిపి ముఖ్యమంత్రి సమక్షంలో కార్మికులకు 40 శాతం లాభాల వాటా ప్రకటించాలన్నారు. లాభాల వాటాను దసరా పండుగకు ముందు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో విద్యుత్‌ సంస్థల నుంచి సింగరేణి కంపెనీకి రావాల్సిన సుమారు రూ.59 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తక్షణమే ఇప్పించేందుకు యాజమాన్యం ఉన్నతస్థాయిలో చొరవ తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement