లక్ష్మణచాంద: సోన్ మండల కేంద్రంలోని అభ్యాస గురుకులంలో జోనల్‌స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల యోగ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో అండర్ 14, అండర్ 17 ట్రెడిషనల్, రితమిక్ సోలో, రితమిక్ డబుల్, ఆర్టిస్టిక్ సోలో, ఆర్టిస్టిక్ డబుల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఎస్‌జీఎ ఫ్ సెక్రెటరీ రాథోడ్ లక్ష్మణ్, యోగా నేచురోపతి డాక్టర్ అన్నపూర్ణ, పీడీలు ఇమ్రాన్, ద ర్శనం దేవేందర్, త్రివేణి, పాఠశాల ప్రిన్సిపా ల్ ప్రదీప్ కుమార్, యోగా కోచ్ ప్రదీప్, మల్లేశ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


