మందుల పిచికారీలో జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

మందుల పిచికారీలో జాగ్రత్త

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

● రైతులు రక్షణ చర్యలు తీసుకోవాలి ● ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజులు ధరించాలి ● గాలి వీచే దశలోనే స్ప్రే చేయాలి

చెన్నూర్‌రూరల్‌: రైతులు రసాయనిక మందులు పిచికారీ చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నా రు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోక పోవడంతో రైతులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ప్రస్తుతం వరి, పత్తి, మిరప పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పత్తి 1.73 లక్షల ఎకరాల్లో, వరి పంట 1.34లక్షల ఎకరాల్లో, మిరప 20వేల ఎకరాల్లో సాగవుతోంది. ప్రస్తుత తరుణంలో పంటలకు చీడపీడలు సోకుతుండటంతో రైతులు మందులను పిచికారీ చేస్తున్నారు. అవగాహన లోపం, తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. పంటలపై మందులు పిచికారీ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోక పోవడంతో అది నోరు, ముక్కు ద్వారా లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది. పురుగు మందు డబ్బాపై ఎరుపు రంగులో గుర్తు ఉంటే అది చాలా విషపూరితమని గ్రహించాలి. అలాగే పసుపు రంగు గుర్తు ఉంటే మధ్యస్తంగా ప్రభావం ఉంటుంది. నీలి రంగులో గుర్తు ఉంటే తక్కువ విష ప్రభావం ఉన్నట్లు రైతులు గుర్తించాలి.

అప్రమత్తత అవసరం..

రైతులు మందులు నీటిలో కలిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. నోటితో మందు డబ్బాల మూ తలు తీయకూడదు. మందు పిచికారీ పూర్తయిన త రువాత ఇంటి దగ్గర నల్లాల వద్ద కడగరాదు. వ్యవసాయ పంట పొలాల వద్దనే శుభ్రంగా కడగాలి. మందులు పిచికారీ చేసే సమయంలో ముఖానికి మాస్క్‌, చేతులకు గ్లౌజులు, కళ్లకు అద్దాలు, శరీరాని కి రక్షణ ఉండేలా దుస్తులు ధరించాలి. గాలి వీచే దిశకు మందులు స్ప్రే చేయకూడదు. ఎందుకంటే ముఖంపై, శరీరంపై మందు పడే అవకాశం ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే మందులు పిచికారీ చేసుకోవాలి. మందులు పిచికా రీ చేసే సమయంలో పొగాకు, గుట్కాలు తినడం, నీళ్లు తాగడం, పొగ తాగడం, కళ్లను నలుపుకోవడం, అలాగే చేతులతో నోటిని తాకడం వంటివి చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ రైతులు మందులు పిచికారీ చేసుకోవాలి.

రైతులు జాగ్రత్తలు పాటించాలి..

రైతులు పంటలకు రసాయ న మందులు పిచికారీ చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. మందులు కలిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కళ్లకు, నోటికి, ముక్కుకు, శరీరానికి మందు అంటకుండా చూసుకోవాలి. పిచికారీ పూర్తయిన వెంటనే వ్యవసాయ పొలం వద్ద పరికరాలను శుభ్రం చేసుకొని చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మందు పిచికారీ చేసే సమయంలో వేసుకున్న దుస్తులను అక్కడే భద్రపరుచుకోవాలి.

– బానోతు ప్రసాద్‌, ఏడీఏ, చెన్నూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement