‘హామీలు అమలు చేయకుండా విమర్శలా’ | - | Sakshi
Sakshi News home page

‘హామీలు అమలు చేయకుండా విమర్శలా’

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

శ్రీరాంపూర్‌: సింగరేణి ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చి న హామీలను అమలు చేయకుండా తమపై విమర్శలు చేస్తారా అని మాజీ ఎమ్మెల్యే యన్‌.దివాకర్‌రా వు, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అ న్నారు. గురువారం శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్ట్‌ గనిపై నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో వారు మాట్లాడారు. గుర్తింపు సంఘం కాల పరిమిత ముగిసినందున సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చే శారు. అప్పటివరకు రిజిష్టర్‌ కార్మిక సంఘాలన్నింటికీ సమాన హోదా కల్పించి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చర్చలకు ఆహ్వానించాలన్నారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు గత ఎన్ని కల్లో అనేక హామీలు ఇచ్చి గెలిచారని, ఏ ఒక్కటీ సాధించలేదన్నారు. పలువురు కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరగా వారికి కండువా కప్పి స్వాగతం పలి కారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు రమేష్‌, పొగాకు రమేష్‌, అన్వేష్‌రెడ్డి, గట్టయ్య, గడ్డం సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement