జైపూర్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అండర్–14 బాక్సింగ్ జోనల్‌స్థాయి పోటీల్లో జైపూర్‌కు చెందిన పాదం సాహిత్ పటేల్, వేముల లోహిత ప్రతిభ కనబర్చారు. 36–38 కిలోల విభాగంలో మంచిర్యాల జిల్లా తరపున పోటీలో నిలిచిన సాహిత్ స్వర్ణ పతకం సాధించగా, 38–40 కిలోల విభాగంలో వేముల లోహిత్ రజత పతకం సాధించాడు. ఇద్దరూ ఎస్టీపీపీలో సీఐఎస్‌ఎఫ్ సీనియర్ కానిస్టేబు ల్ పాదం మహేందర్ వద్ద శిక్షణ పొందుతున్నారు. విజేతలను డీఈవో చంద్రయ్య, ఏఐఎస్, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ యాకూబ్, సీనియర్ కోచ్ మైసూర్, సీనియర్ క్రీడాకారులు వేముల కిరణ్, జగత్ సాయి, శ్రీకాంత్, ఎన్‌ఐఎస్ బాక్సింగ్ కోచ్ సందీప్ అభినందించారు.


