కాసిపేట: మందమర్రి, సోమగూడం నాలుగు లైన్ల జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న టోల్‌ప్లాజా సిబ్బందిపై గురువారం సూపర్‌వైజర్లు దాడికి పాల్పడ్డారు. టోల్‌ప్లాజాలో ఆర్చ్‌లైట్ సంస్థ ఆధ్వర్యంలో విధులు నిర్వహించే సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు సక్రమంగా అందడం లేదని, ఈనెల జీతం తక్కువగా వచ్చిందని వారు ప్రశ్నించారు. కంపెనీ అందించే పేమెంట్‌లో తక్కువ, ఎక్కువ రావడం, జాప్యం జరగడం ఏమిటని సూపర్‌వైజర్లతో సిబ్బంది వాదనకు దిగారు. ఈక్రమంలో ఓ సూపర్‌వైజర్ సిబ్బందిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సిబ్బంది విధులు బహిష్కరించి మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సూపర్‌వైజర్ అధికార పార్టీ నాయకుడి బంధువు కావడంతో పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీనెల రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు వేతనాలు తక్కువగా వేస్తున్నారని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వాపోయారు. వీరికి ఐఎఫ్‌టీయూ నాయకులు మద్దతుగా నిలిచి చర్చలు కొనసాగించారు.


