నెన్నెల: మండలంలోని నార్వాయిపేట గ్రామంలో ఎకై ్సజ్, పోలీసుశాఖ ఆధ్వర్యంలో గురువారం సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 23 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడంతోపాటు 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు చెన్నూర్ ఎకై ్సజ్ సీఐ హరి తెలిపారు. ఆరుగురిపై కేసులు నమోదు చేసి తహసీల్దార్ శ్రీనివాస్ ఎదుట బైండోవర్ చేశారు. అక్రమంగా నాటుసారా తయారు చేసిన, విక్రయించిన పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నెన్నెల ఎస్సై రామకృష్ణ, చెన్నూర్ ఎకై ్సజ్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


