మామిడిలో యాజమాన్య పద్ధతులు | - | Sakshi
Sakshi News home page

మామిడిలో యాజమాన్య పద్ధతులు

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

● సస్యరక్షణ చర్యలతో దిగుబడి ● తోటల్లో ప్రత్యేకశ్రద్ధ అవసరం

బెల్లంపల్లి: మామిడి తోటల్లో కోతల అనంతరం రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. కోతలు పూర్తయిన తదుపరి తోటల నిర్వహణపై ప్రత్యేక శద్ధ వహించడం వల్ల వచ్చే ఏటా పుష్పోత్పత్తి, కాయధారణ, అధిక దిగుబడి సాధించడానికి వీలువుతుంది. కోత అనంతరం చేపట్టే యాజమాన్య చర్యలతో పురుగులు, వ్యాధుల తీవ్రతను తగ్గిస్తాయి. తోటల నిర్వహణను నిర్లక్ష్యం చేయకుండ చెట్ల కత్తిరింపులు, ఎరువుల వినియోగం, సూక్ష్మపోషకాల పిచికారీ, పురుగు, వ్యాధుల సమగ్ర నివారణ చర్యలు చేపడితే నాణ్యమైన దిగుబడి సాధించవచ్చునని బెల్లంపల్లి కృషి విజ్ఙాన కేంద్రం (కేవీకే) ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్‌ యు.స్రవంతి తెలిపారు. ఇంకా ఆమె మాటల్లోనే..

తోట పరిశుభ్రత

మామిడి చెట్ల కింద ఎండిపోయిన పండ్లు, ఎండి న ఆకులు, వ్యాధిగ్రస్త కొమ్మలను తొలగించాలి. చెట్టు చుట్టూరా పెరిగిన కలుపు మొక్కలు తొలగించి తోటను పరిశుభ్రంగా ఉంచాలి. వ్యాధిగ్రస్త మొక్కల అవశేషా లను తోట బయట గుంతను

తవ్వి పూడ్చివేయాలి.

ఎరువుల యాజమాన్యం

పదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న చెట్టుకు తగిన మోతాదులో ఎరువులు వినియోగించాలి. 50–100 కిలోల పశువుల ఎరువు, 2.2 కిలోలు యూరియా, 6.0 కిలోల సింగిల్‌ సూపర్‌ఫాస్పేట్‌, 1.7 మ్యూరియేట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంఓపీ) ఎరువులను చెట్టునీడ పరిధి వద్ద వలయాకారంలో 15–20 సెం.మీ లోతులో వేసి మట్టితో కప్పాలి.

సూక్ష్మపోషకాల పిచికారీ

చెట్లకు కొత్త చిగుర్లు వచ్చిన 20–30 రోజుల తర్వాత జింక్‌ సల్పేట్‌: 5గ్రా/ లీటర్‌, బోరాక్స్‌:1గ్రా/లీటర్‌, మెగ్నీషియం సల్పేట్‌: 5 గ్రా/లీటర్‌ నీటిలో తగిన మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. లేదా మామిడి స్పెషల్‌ మైక్రో న్యూట్రియంట్‌ మిశ్రమం: 5 గ్రా/ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

నీటి యాజమాన్యం

వర్షాలు కురిసే వరకు10–15 రోజుల వ్యవదిలో

నీరందించాలి. వర్షాకాలంలో చె ట్ల మొదళ్లలో నీరు నిల్వ కాకుండా కాలువలు ఏర్పాటు చేయాలి. డ్రిప్‌ ఇరిగేషన్‌ ఉన్న తోటల్లో మట్టిలో తేమను బట్టి నీరు ఇవ్వాలి.

అంతర పంటల సాగు

చిన్నవయస్సు ఉన్న మామిడి తోటల్లో అంతరపంటలు సాగు చేసుకోవాలి. చెట్లు కాపుదలకు వచ్చేవరకు పంటలను సాగు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతర పంటలుగా పెసర, మినుము, కంది, అలసంద వంటి పప్పు ధాన్యాల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చు.

మామిడి తోట

కొమ్మలు తొలగించాలి

రకరకాల కారణాలతో చెట్లకొమ్మలు విరిగి, ఎండిపోయి ఉంటాయి. ఒకదానిపై మరొకటి పెరిగిన కొమ్మలు తొలగించాలి. చెట్టు మధ్యభాగంలో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా కత్తిరింపు చేయాలి. సుమారు 1–1.5 సెం.మీ కంటే పెద్ద గాయాలపై బోర్డో పేస్ట్‌ లేదా కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ పూత వేయాలి. కత్తిరించిన కొమ్మలను తోట బయట తొలగించాలి. తోట అంతర్భాగంలో కొమ్మలు ఉండకుండా

జాగ్రత్తలు తీసుకోవాలి.

మామిడి తోటల్లో వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక వర్షపాతం కారణంగా నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చెట్టు చుట్టూ మల్చింగ్‌ చేయడం ద్వారా నేల తేమను కాపాడటానికి వీలవుతుంది. మెరుపులు, గాలివానల వల్ల విరిగిన కొమ్మలను వెంటనే తొలగించాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement