డీఎడ్‌ సర్టిఫికెట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

డీఎడ్‌ సర్టిఫికెట్ల పరిశీలన

Jun 19 2026 1:12 AM | Updated on Jun 19 2026 1:12 AM

ఆదిలాబాద్‌టౌన్‌: డీఎడ్‌ కళాశాలలో సీట్ల కోసం గురువారం ప్రభుత్వ డైట్‌ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను పరిశీలించుకున్నారు. ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ హై, వైస్‌ ప్రిన్సిపాల్‌ కిరణ్‌ కుమార్‌, కార్యాలయ సూపరింటెండెంట్‌ మమతలు పర్యవేక్షించారు. ఈనె ల 19, 20 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలిపారు. 21న ఎడిట్‌ ఆప్షన్‌, 25న కళాశాలల కేటాయింపు ఉంటుందని వివరించారు.

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

మంచిర్యాలటౌన్‌: పోటీ పరీక్షల కోసం తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్‌, కెరీర్‌ కౌన్సెలింగ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని అర్హులైన అభ్యర్థులకు ఉచితంగా నాలుగు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి నీరటి రాజేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. టీజీపీఎస్సీ గ్రూప్‌–1, 2, 3, 4, ఎస్సెస్సీ సీజీఎల్‌, యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌, ఆర్‌ఆర్‌బీ అసిస్టెంట్‌ లోకో పైలట్‌, టెక్నీషియన్‌, పోలీస్‌ నియామకాలు, ఐబీపీఎస్‌, ఇతర పోటీపరీక్షలకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 25 నుంచి తరగతులు ప్రారంభించనుండగా, 100 మంది అభ్యర్థులకు మాత్రమే శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 040–23236112, 9059050062 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

లోక్‌ అదాలత్‌

విజయవంతం చేయండి

చెన్నూర్‌: చెన్నూర్‌కోర్టులో నిర్వహించే జాతీ య లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయాలని చెన్నూర్‌ సివిల్‌ జడ్జి పర్వతపు రవి అన్నారు. గురువారం స్థానిక కోర్టు సమావేశ మందిరంలో పోలీసు, ఎకై ్సజ్‌, బ్యాంక్‌ అధికారులతో ఈ నెల 20న నిర్వహించే లోక్‌ అదాలత్‌పై సమావేశం నిర్వహించారు. చెన్నూర్‌, కోటపల్లి, నీల్వాయి, భీమారం పోలీసు స్టేషన్ల పరిధిలోని కేసుల పరిష్కారానికి పోలీసులు సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐలు బన్సీలాల్‌, కృష్ణ, ఎకై ్సజ్‌, బ్యాంక్‌ అధికారులు, కోర్టు పోలీసులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement