ఆలయంపై ఎక్కిన యువకులు
ట్యాంకెక్కిన చింతకర గ్రామస్తులు
ఉట్నూర్ మండలం చింతకర అనుబంధంగా ఉన్న మూడు గ్రామాలకు సెల్ సిగ్నల్ లేక ఆదివాసీలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్ రాక ఉపాధి పనులకు దూరమవుతున్నారు. పింఛన్, రేషన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అత్యవసర సమయంలో ఫోన్ మాట్లాడాలన్న ట్యాంక్, చెట్లు ఎక్కాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు తమ గ్రామాలకు సెల్ టవర్ ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు. – ఇంద్రవెల్లి


