శాంతిఖని దశ తిరిగేనా? | - | Sakshi
Sakshi News home page

శాంతిఖని దశ తిరిగేనా?

Jun 17 2026 11:47 PM | Updated on Jun 17 2026 11:47 PM

● రెండు దశాబ్దాలకు సరిపడా బొగ్గు నిక్షేపాలు ● ఇటీవల పరిశీలించిన ఆస్ట్రేలియా కంపెనీ ప్రతినిధులు

బెల్లంపల్లి:బొగ్గు ఉత్తత్తిలో బెల్లంపల్లిలోని శాంతిఖని గనిది సుదీర్ఘ ప్రస్థానం. 72 ఏళ్లుగా తవ్వకాలు జరుపుతున్నా మరో రెండు దశాబ్దాలకు పైగా సరిపడా బొగ్గు నిల్వలు ఉండడం విశేషం. ఈ గనిలో బొగ్గు ఉత్పత్తికి ఏర్పడుతున్న ప్రతికూల పరిస్థితులు సంకటంగా మారుతున్నాయి. ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతున్నా ముందుకు సాగుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ గనిలో ఉన్న నల్ల బంగారాన్ని పూర్తి స్థాయిలో వెలికితీసేందుకు సింగరేణి యా జమాన్యం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగించుకుంటూనే విదేశీ ప్రైవే ట్‌ సంస్థల సహకారం ఆశిస్తోంది. ఇందులో భాగంగా కొన్నాళ్ల క్రితం జా య్‌ మైనింగ్‌ సర్వీసెస్‌ (జేఎంఎస్‌) ప్రైవేట్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుని బొగ్గు ఉత్పత్తి కోసం చేసిన యత్నాలు సత్ఫలితాలు ఇవ్వలేదనే అసంతృప్తి ఉంది. ఆ క్రమంలోనే సింగరేణి, జేఎంఎస్‌ మధ్య పొరపొచ్చాలు రావడం అగ్నికి ఆజ్యం పోసినట్‌లైంది. సింగరేణితో చేసుకున్న ఒప్పందం రద్దుకు జేఎంఎస్‌ యత్నాలు సాగిస్తుండగా యా జమాన్యం కూడా అంతేస్థాయిలో స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మరో ప్రైవేట్‌ కంపెనీతో సంప్రదింపులు జరుపుతున్నా రు. ఆ సంస్థ ప్రతినిధి బృందం ఈ నెల 10న గనిలో దిగి పనిస్థలాలను, భూగర్భ భౌగోళిక పరిస్థితులను ప్రాథమికంగా పరిశీలించి ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం రెండు నెలల్లో వెల్లడిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పి వెళ్లగా ఏ నిర్ణయం తీసుకుంటారోనని గని అధికారులతో పాటు కార్మికులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

విఫలమైన ఆధునిక యంత్ర ప్రయోగాలు

బొగ్గు అధికోత్పత్తి చేయాలనే ఉద్దేశంతో గనిలో ఆధునిక యంత్రాలను ప్రయోగాత్మకంగా దింపారు. కంటిన్యూయస్‌ మైనర్‌ (సీఎం) యంత్రాన్ని ప్రవేశ పెట్టినా ఏమాత్రం స త్ఫలితాలు ఇవ్వలేదు. ఆ యంత్రం కోసం భూగర్భంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎంతగా శ్రమించినా ఆ యంత్రం ఆశలు నెరవేర్చక పోగా తీవ్ర నిరాశకు గురి చేసింది. చివరకు ఆ యంత్రాన్ని ఆర్జీత్రీ ఏరియాకు తరలించారు. అదేక్రమంలో జేఎంఎస్‌ విదేశీ ప్రైవేట్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని బోల్టర్‌ మైనర్‌ (బీఎం) యంత్రాన్ని తె చ్చారు. ఇదికూడా సరిగా పనిచేయకపోవడంతో ఆ శలపై నీళ్లు చల్లించింది. ప్రస్తుతం ఎస్‌డీఎల్‌ యంత్రాలతో అతికష్టంగా బొగ్గు వెలికితీత ప్రక్రియ కొనసాగిస్తున్నా లక్ష్యాన్నీ చేరుకోలేక చతికిల పడుతున్నట్లు తెలుస్తోంది. మిగిలి ఉన్న 43 మిలియన్‌ ట న్నుల్లో 13 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలను కంటీ న్యూయస్‌ మైనర్‌ యంత్రం ద్వారా, 30 మిలి యన్‌ టన్నుల బొగ్గును లాంగ్‌ వాల్‌ ప్రాజెక్టు ద్వారా వెలికి తీయాలని చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. గనిని లాంగ్‌వాల్‌ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి. కొ త్తగా షార్ట్‌వాల్‌ ప్రాజెక్టు తెరమీదకు తెచ్చినా అ దికూడా అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలి యా కంపెనీపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

శాంతిఖని భూగర్భంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. 43 మిలియన్‌ టన్నుల బొగ్గు సంపద ఉన్నట్లు సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం అధికారులు చేసిన సర్వేలో గుర్తించారు. గనిలో ప్రస్తుతం 450 మీటర్ల లోతులో పనిస్థలాలు ఉన్నాయి. అంతదూరం వెళ్లి బొగ్గు వెలికి తీయాల్సివస్తుండగా భూగర్భ భౌగోళిక పరిస్థితులు, గాలి సరఫరా, తదితర సమస్యలు అశాంతికి గురి చేస్తున్నాయి. భూగర్భంలో దిగి పని స్థలాలకు చేరుకునే లోపే కార్మికులు అలసి పోతున్నారనే ఉద్దేశంతో శాంతిఖనికి అనుబంధంగా రూ.22 కోట్లు వ్యయం చేసి షాప్ట్‌ వైండింగ్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం షాప్ట్‌ వైండింగ్‌ ద్వారా కార్మికులు గనిలో దిగి విధులు నిర్వహించడం ఊరట నిస్తోంది.

ఆస్ట్రేలియా కంపెనీపైనే..

గనిలో దిగి పనిస్థలాలను పర్యవేక్షించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం గనిలో ఉన్న బొగ్గు నిల్వలను పూర్తిస్థాయిలో వెలికితీయడం సాధ్యమేనని సూచనప్రాయంగా తెలిపింది. సమగ్రంగా అధ్యయనం చేసి రెండు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ బృందం పరిశీలించిన అంశాలు, వ్యక్త పరిచిన అభిప్రాయాలు గని భవిష్యత్‌కు దోహదపడతాయనే ఆశాభావంతో ఉన్నాం.

– సంజయ్‌కుమార్‌ సిన్హా,

శాంతిఖని గని మేనేజర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement