మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముల్కల్లలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మంచిర్యాల రూరల్ సీఐ గో పతి రవీందర్ తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లికి చెందిన తోకల రమేశ్, పద్మశాలీ కాలనీకి చెందిన తౌటం అశోక్ మార్చి 25న ముల్కల్లకు చెందిన దర్వాజ రాజయ్య ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దొనబండ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 వేల నగదు, 3 తులాల వెండి గొలుసులు, 20 అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు.


