బోథ్: బోథ్ అటవీ శాఖ రేంజ్ అధికారి టి.ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ ఎస్.పరశురాం గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆదిలాబాద్ ఏిసీబీ డీఎస్పీ జి.మధు తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ అటవీ రేంజ్ పరిధిలో ఉపాధిహామీ పథకంలో భా గంగా ట్రాక్టర్‌తో నీటి ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీరు పోసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లు రూ.5,09,000 చెక్కు విడుదలకు అటవీ రేంజ్ అధి కారి టి.ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ ఎస్.పరశురామ్ రూ.40 వేలు డిమాండ్ చేశారు. రూ.15 వేలు లంచం ఇవ్వడానికి బాధితుడు అంగీకరించాడు. గురువారం జూనియర్ అసిస్టెంట్ పరశురాంకు నగ దు ఇవ్వాలని బాధితుడికి చెప్పిన ఎఫ్‌ఆర్‌ఓ ప్రణ య్ ఆదిలాబాద్‌లో జరిగిన అటవీశాఖ అధికారుల సమావేశానికి వెళ్లారు. ఐసీడీఎస్ భవనం వద్ద పరశురాంకు రూ.15 వేలు అందిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానిక అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించి విచారించారు. బోథ్ అటవీ శాఖ రేంజ్ అధికారి ప్రణయ్ పాత్ర ఉందని తెలుసుకున్న ఏసీబీ అధికారులు ఆదిలాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కరీంనగర్‌లోని కోర్టుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు.


