ఇచ్చోడ: మండల కేంద్రంలోని రెడ్డికాలనీకి చెందిన వ్యాపారవేత్త సురకంటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు సుజయ్‌రెడ్డికి న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ స్టెర్న్ బిజినెస్ స్కూలులో ప్రవేశం లభించింది. ప్రపంచంలోనే టాప్ 10లో ఉన్న స్కూలులో ప్రవేశం దక్కించుకున్న సుజయ్ చిన్ననాటి నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. మండల ప్రజలు అభినందించారు.
మంచిర్యాల డీఆర్‌డీవో బదిలీ
పాతమంచిర్యాల/ఆసిఫాబాద్: మంచిర్యాల డీఆర్‌డీవోగా పనిచేస్తున్న ఎస్.కిషన్ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అ య్యా రు. ఆయన స్థానంలో కుమురంభీం ఆసిఫా బాద్ జిల్లాలో పనిచేస్తున్న బి.దత్తారావును మంచిర్యాల డీఆర్‌డీవోగా నియమిస్తూ ప్ర భుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
కాగజ్‌నగర్‌టౌన్: కడుపునొప్పి భరించలేక వి వా హిత ఆత్మహత్య చే సుకున్న సంఘటన ప ట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల మేర కు పట్టణంలోని సర్‌సిల్క్ కాలనీకి చెందిన సునిత్ విశ్వాస్ భార్య తానియా విశ్వాస్(22)కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రిలో చికిత్స చేయించినా నయం కాలేదు. గురువారం నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలా నికి ఉరేసుకుంది. మృతురాలి సోదరుడు వాసుదేవ్ సర్కార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలి పారు.
గంజాయి సేవించిన ఇద్దరిపై కేసు
భీమారం: గంజాయి సేవించిన ఇద్దరిపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఏ.రాజేందర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు మండల కేంద్రానికి చెందిన పోలవేని రాజేందర్, అలం మధుకర్‌ను అరెస్టు చేసి మెడికల్ ఆఫీసర్ సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఎన్‌డీపీఎస్ చట్టం సెక్షన్2(బి) ప్రకారం కేసు నమోదు చేసి చేసినట్లు తెలిపారు.


