దండేపల్లి: తల్లి బతికున్నంత కాలం పోషణ బాఽ ద్యత చూసుకుంటానని పెద్దల సమక్షంలో ఒప్పుకున్నాడు. ఆస్తి మొత్తం తీసుకున్న తర్వాత బాధ్యతలు విస్మరించిన ఆ కుమారుడు ఇంట్లోకి రానీయకపోవడంతో ఆ తల్లి రోడ్డున పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. దండేపల్లికి చెందిన గడ్డం వరమ్మకు శంకరయ్య, తిరుపతి, శ్రీనివాస్ కుమారులు. రెండో కుమారుడు తిరుపతి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. తల్లి పేరుతో ఉన్న ఆస్తిని ఐదేళ్లక్రితం పంపకాలు చేసుకున్నారు. తల్లి బాధ్యతలు తానే చూస్తానని చిన్న కుమారుడు శ్రీనివాస్ ముందుకు వచ్చాడు. ఇందుకు అతనికి అందరికంటే ఎక్కువగా 9గుంటల వ్యవసాయ భూమి, ఎనిమిదిన్నర తులాల బంగారం, సుమారు రూ.1.90 లక్షల నగదు అప్పగించారు. ఆస్తి మొత్తం ముట్టిన తర్వాత ఆ కుమారుడు తల్లిని ఇంట్లోకి రానీయకపోవడంతో కూతు రు, బంధువుల ఇళ్లకు తిరుగుతోంది. గురువారం కూతురు ఇంటినుంచి దండేపల్లికి వచ్చిన వృద్ధురాలు చిన్నకుమారుడి ఇంటికి వెళ్లడంతో అతను రానీయలేదు. దీంతో దండేపల్లి బస్టాండ్ వద్ద హో టల్ ముందు కూర్చుని గ్రామస్తులతో తన గోడు వెల్లబోసు కుంది. విషయం తెలుసుకున్న ఎస్సై తహసీనొ
ద్దీన్ వృద్ధురాలితో మాట్లాడాడు. శ్రీనివాస్‌కు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ఆమెను పెద్ద కుమారుడు శంకరయ్యకు అప్పగించాడు. ఉ న్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు వేడుకుంటోంది.


