మొర్రిపండ్లు.. భలే తియ్యన
ఆర్డీవో కార్యాలయం పక్కన విక్రయిస్తున్న తాటిముంజలు
తాటిముంజలు వేసవిలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శరీరానికి చల్లదనం ఇవ్వడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపర్చడానికి దోహదపడతాయి. దీంతో ప్రతిఒక్కరూ వీటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కడెం మండలం నుంచి తాటి ముంజలను తీసుకువచ్చి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం పక్కన విక్రయిస్తున్నారు. డజన్ ముంజలకు రూ.80 నుంచి వంద వరకు తీసుకుంటున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
మహారాష్ట్ర, తెలంగాణలోపి దట్టమైన అడవుల్లో తునికి చెట్లు అధికంగా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలోనే తునికి పండ్లు లభిస్తాయి. ఇవి కొంచెం తీపిగా కొంచెం వగరుగా ఉంటాయి. వేసవిలో సహజ సిద్ధంగా లభించే ఈ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరంలో వేడిని తగ్గిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఆదివాసీలు అడవుల్లో సేకరించిన తునికి పండ్లను కిలోకు రూ.300 నుంచి రూ.400 వరకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
ప్రకృతి సిద్ధమైన మొర్రిపండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి తీపి, పులుపుగా ఉంటాయి. చిన్నారుల ఎదుగుదలకు దోహదపడతాయి. శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. మొర్రిపండ్లను తిన్నతర్వాత వాటి గింజలను పగులగొడితే సారా పలుకులు ఉంటాయి. వీటిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మార్కెట్లో మొర్రిపండ్లను ఒక చిన్నడబ్బాకు రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. వేసవిలో మాత్రమే దొరికే ఈపండ్లకు మార్కెట్లో
మంచి డిమాండ్ ఉంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్


