మానసిక సాంత్వన అవసరం
ఇటీవల యువతలో ఒత్తిడి ని తట్టుకునే సామర్థ్యం త గ్గుతోంది. విద్యా పోటీలు, ఉద్యోగ సమస్యలు, కుటు ంబ కలహాలు, ప్రేమ వ్య వహారాలు వంటి చిన్న కారణాలకే తీవ్రమైన మానసిక దుఃఖానికి లోనవుతున్నారు. భావో ద్వేగాలను సమర్థంగా వ్యక్తపరచలేకపోవడం, సమస్యలను శాశ్వతంగా చూస్తూ నిరాశలోకి జారిపోవడం ప్రమాదకరం. నిద్రలేమి, ఆకలిలో మార్పులు, నిరుత్సాహం, ఏ పనిలో నూ ఆసక్తి లేకపోవడంవంటివి కనిపిస్తే వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి.
– అల్లాడి సురేశ్, సైకియాట్రిస్టు, నిర్మల్


