మహిళా సర్పంచులకు ముగిసిన శిక్షణ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కేంద్ర బృందం ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా ఇస్తున్న ప్రత్యేక శిక్షణ గురువారం ముగిసింది. సర్పంచ్‌ల శిక్షణలో రాష్ట్రం నుంచి 50 మంది సర్పంచ్‌లు ఉండగా ఇందులో జిల్లాకు చెందిన హాజీపూర్ మండలం దొనబండ సర్పంచ్ బేతు రమాదేవి, చెన్నూర్ మండలం సుద్దాల సర్పంచ్ స్వాతి, భీమారం సర్పంచ్ విజయలక్ష్మి ఉన్నారు. గ్రామాభివృద్ధి, మహిళా సాధికారత, పంచాయతీరాజ్ చట్టం, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవలు, పారిశుద్ధ్యం తదితర వాటిపై అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చారు.


