కలప పట్టివేత | - | Sakshi
Sakshi News home page

కలప పట్టివేత

Feb 20 2026 6:44 AM | Updated on Feb 20 2026 6:44 AM

కలప పట్టివేత

కలప పట్టివేత

ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని అంకోలి శివారులో అక్రమంగా తరలిస్తున్న కలపను గురువారం పట్టుకున్నట్లు ఎఫ్‌ఆర్‌వో గులాబ్‌సింగ్‌ తెలిపారు. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలోని అంకోలి బుర్కి గ్రామం నుంచి కలప తరలిస్తున్నట్లు తమకు అందిన సమాచారంతో సిబ్బందితో కలిసి తనిఖీలు చేయగా బొలెరో వాహనంలో రూ.25వేల విలువైన కలప లభ్యమైనట్లు తెలిపారు. కలప, వాహనం స్వాధీనం చేసుకుని నిందితులు ఆదిలాబాద్‌ పట్టణంలోని పిల్లి యోగేష్‌, సుఫియన్‌, హరిష్‌, భారతి బాయిని అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీట్‌ ఆఫీసర్‌ శంకరయ్య, సిబ్బంది సంతోషిని, అమర్‌సింగ్‌, రామేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement