నిర్మల్‌కు చేరిన పోలీస్ జాగిలం
నిర్మల్‌టౌన్: ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో 8 నెలల పాటు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ జాగిలం ‘యామి’ గురువారం నిర్మల్‌కు చేరుకుంది. ట్రాకర్ కేటగిరీకి చెందిన బెలిజియం మలినియోస్ బ్రీడ్‌కు చెందిన ఈ జాగిలం గమనించే శక్తి, వాసన గుర్తించే సామర్థ్యం, నేర అన్వేషణలో కచ్చితత్వం వంటి లక్షణాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేర పరిశోధనలు, మిస్సింగ్ కేసులు, ట్రాకింగ్ ఆపరేషన్లు వంటి కీలక సందర్భాల్లో ఇది పోలీస్ విభాగానికి ఎంతో తోడ్పడుతుంది. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిలను యామి తన హ్యాండ్లర్లతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసింది. భవిష్యత్‌లో జాగిలం నిర్వహించనున్న విధులపై హ్యాండ్లర్లు ఎస్పీకి వివరించారు.


