కదిలి, కాల్వ ఆలయాల్లో హుండీ లెక్కింపు
దిలావర్‌పూర్: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలోని అత్యంత ప్రాచీన ప్రాశస్త్యంగల శ్రీమాతా అన్నపూర్ణ కదిలి పాపహరేశ్వర, కాల్వ పరిసర అటవీ ప్రాంతంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాల హుండీలను దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో గురువారం లెక్కించారు. కదిలి ఆలయ హుండీ ద్వారా రూ.4,11,886, కాల్వ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రూ. 8,19,050 ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. కార్యక్రమంలో కాల్వ ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్, కదిలి ఆలయ కమిటీ చైర్మన్ నార్వాడి వెంకట్రావు, ఆలయ ఈవో భూమయ్య, సీనియర్ అసిస్టెంట్ జాదవ్ మాధవరావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


