రహదారి నిబంధనలపై అవగాహన కల్పించాలి
నస్పూర్: వచ్చే జనవరిలో రోడ్డు భద్రతా ఉత్సవా లు నిర్వహిస్తామని, రహదారి నిబంధనలపై ప్రజ లకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కుమార్ దీప క్ అన్నారు. మంగళవారం ఆయన నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్‌తో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, రోడ్డు భవనాలు, ఆర్టీసీ, విద్యుత్, పంచా యతీరాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్–కరీంనగర్–చంద్రాపూర్ రహదారిపై రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్, జాగ్రత్త సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు.
100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పోటీలు
నస్పూర్: ప్రభుత్వం నిర్వహిస్తున్న 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టర్ చాంబర్‌లో మంగళవారం ఆయన పోటీల వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక అందాల ఫొటోలు, వీడియో రూపంలో పరిచయం చేసిన వారికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భారీ నగదు బహుమతులు అందిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ప్రాచుర్యం పొందని పర్యాటక ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావడ మే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తోందని అన్నారు. ప్ర కృతి, వన్యప్రాణులు, కళా సంస్కృతి, వారసత్వం, జలాశయాలు, వంటకాలు, గ్రామీణ జీవనం, రిసార్ట్స్, ఆధ్యాత్మిక ప్రాంతాలు వంటి అంశాలపై ఫొటోలు, వీడియోలు పంపించవచ్చని సూచించారు. మొ దటి బహుమతి రూ.50 వేలు, ద్వితీయ రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు అందిస్తారని అన్నారు. ఆసక్తి గలవారు జనవరి 5లోపు ఎంట్రీలు పంపించాలని, విజేతలను సంక్రాంతి కై ట్ ఫెస్టివల్ సందర్భంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా సేవల అధికారి హనుమంతరెడ్డి, ఎస్సీ కులా ల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ తదితరులు పాల్గొన్నారు.


