ఉద్యోగ భద్రత కల్పించాలి
ఆదిలాబాద్: ధూపదీప నైవేద్య అర్చకులకు ఉ ద్యోగ భద్రత కల్పించాలని ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ కోరారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన అర్చక చైతన్యయాత్ర మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని మంగమఠంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డీడీఎన్ అర్చకులకు రూ.35వేల వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల ని కోరారు. దేవాలయాలకు సేవలందిస్తున్న అ ర్చకులను నిర్లక్ష్యం చేయడం తగదని, అర్చక కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చే యాలని డిమాండ్ చేశారు. అనంతరం అర్చకులు ర్యాలీగా దేవాదాయ ధర్మాదాయశాఖ కా ర్యాలయానికి వెళ్లి అసిస్టెంట్ కమిషనర్ నవీన్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణశర్మ, కోశాధికారి హరికిషన్, రాష్ట్ర మహిళా ప్రతినిధి విశాలాక్షమ్మ, రాష్ట్ర సహ కార్యదర్శి పరిపూర్ణాచారి, ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ యోగేశ్‌కుమార్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు శిరీశ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శర్మ, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మధు, ఆదిలాబాద్ ఇన్‌చార్జి విజయ్‌కుమార్‌చారి తదితరులు పాల్గొన్నారు.


