సత్తా చాటిన పాలిటెక్నిక్ విద్యార్థులు
ఆదిలాబాద్‌టౌన్: డిస్ట్రిక్ట్ లెవల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ గేమ్ పోటీల్లో సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు సత్తా చాటారు. ఈనెల 20, 21 తేదీల్లో నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో నిర్మల్, ఆదిలాబాద్, ఉట్నూర్, బెల్లంపల్లి కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన బాలబాలికలు ప్రతిభ కనబర్చి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ డీ నరేశ్, లెక్చరర్లు విద్యార్థులను అభినందించారు. ట్రోఫీ, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి కళాశాలకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్, రామేశ్వర్‌రెడ్డి, నీల్‌కమల్, క్రాంతికుమార్, హిమవర్ష, హేమలత, కుమారస్వామి, సంగీత, సాయన్న తదితరులు పాల్గొన్నారు.


