సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ పోటీల్లో ప్రతిభ
బెల్లంపల్లి: స్కూల్ గేమ్స్‌ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) ఆ ధ్వర్యంలో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థా యి సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ పోటీల్లో మంచిర్యాల జిల్లా బాలబాలికల జట్లు జయకేతనం ఎగురవేశా యి. సోమవారం బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సీవోఈ పాఠశాల, కళాశాల క్రీడా మైదానంలో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి నాలుగు చొప్పున బాలబాలికల జట్లు హాజరయ్యాయి. అండర్–14లో పోటాపోటీగా తలపడ్డారు. సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ విభాగాల్లో వేర్వేరుగా నిర్వహించిన పోటీల్లో మంచిర్యాల జిల్లా బాలబాలికల జట్లు ప్రథమ స్థానం కై వసం చేసుకున్నారు. కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బాలబాలికల జట్లు ద్వితీయ స్థా నాన్ని దక్కించుకున్నాయి. ముగింపు కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ సిహెచ్.హనోక్ బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంచి ర్యాల జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి ఎండి.యాకూబ్, టోర్నమెంట్ అబ్జర్వర్ బండి రవి, సీఈవో సీనియర్ ఉపాధ్యాయుడు దశరథం, వ్యాయామ ఉపాధ్యాయులు ఎండి.చాంద్‌పాషా, ఎస్‌కే రాజ్‌మహ్మద్, అల్లూరి వామన్, ఎం.రాజశేఖర్ పాల్గొన్నారు.
70వ సారి యువకుడి రక్తదానం
నెన్నెల: మండల కేంద్రం నెన్నెలకు చెందిన శ్రీరాంభట్ల సుశాంత్‌శర్మ సోమవారం 70వ సారి రక్తదా నం చేసి ప్రాణదాతగా నిలిచాడు. గోదావరిఖని ఏరి యా ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో తలసే మియాతో బాధపడుతున్న రవికి ఓ నెగిటివ్ రక్తం అవసరం ఏర్పడింది. మంచిర్యాల బ్లడ్‌బ్యాంకు వా రు ఫోన్ చేయగా వెళ్లి దానం చేశాడు. ఇప్పటికే 20 సార్లు రక్తకణాలు కూడా దానం చేశాడు. అ త్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉన్న వారు 8555 899987 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ పోటీల్లో ప్రతిభ


