‘గుండాల’ ప్రమాణ స్వీకారం.. ఇచ్చోడలో | - | Sakshi
Sakshi News home page

‘గుండాల’ ప్రమాణ స్వీకారం.. ఇచ్చోడలో

Dec 23 2025 6:51 AM | Updated on Dec 23 2025 6:51 AM

‘గుండ

‘గుండాల’ ప్రమాణ స్వీకారం.. ఇచ్చోడలో

ఇచ్చోడ: మండలంలోని గుండాల గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రామంలో కాకుండా మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ గ్రామంలో 2018 సంవత్సరంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవల్లో ఇద్దరు మృతి చెందిన విషయం విదితమే. శాంతి భద్రతల సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో గ్రామంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎస్పీ అనుమతి ఇవ్వలేదు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సర్పంచ్‌ షరీఫాబితో పాటు ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులతో ఎంపీడీవో నరేశ్‌ ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు

అప్పగించారు.

నాడు పారిశుద్ధ్య కార్మికుడు.. నేడు సర్పంచ్‌

తానూరు: మండలంలోని తొండాల గ్రామానికి చెందిన మిరేకర్‌ మాధవ్‌ 19సవత్సరాలుగా అదే గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ, గ్రామస్తులకు సేవలందించారు. ఇటీవల గ్రామంలో ఎస్సీ రిజర్వుడ్‌ రావడంతో మాదవ్‌ సర్పంచ్‌గా గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుడి నుంచి సర్పంచ్‌గా తెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేస్తానన్నారు.

‘గుండాల’ ప్రమాణ స్వీకారం.. ఇచ్చోడలో
1
1/1

‘గుండాల’ ప్రమాణ స్వీకారం.. ఇచ్చోడలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement