తల్లి సర్పంచ్.. తనయుడు ఉప సర్పంచ్
లక్ష్మణచాంద: మండలంలోని పార్‌పెల్లి గ్రామ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్‌గా తల్లీ కొడుకులు బాధ్యతలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పార్‌పెల్లి గ్రామ సర్పంచ్‌గా అబ్బడి పుష్ప విజయం సాధించారు. పుష్ప రెండో కుమారుడైన అబ్బడి విద్యాసాగర్ రెడ్డి వార్డు మెంబర్‌గా గెలుపొందారు. దీంతో సోమవారం తల్లి పుష్ప పార్‌పెల్లి సర్పంచ్‌గా, కుమారుడు విద్యాసాగర్ రెడ్డి ఉప సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఉదయం బాధ్యతలు.. మధ్యాహ్నం రాజీనామా
తానూరు: మండలంలోని నంద్‌గాంలో ఇటీవల 3వ వార్డు మెంబర్‌గా గెలిచిన నాగేశ్ సోమవారం ఉదయం సర్పంచ్, వార్డుసభ్యులతో కలిసి ప్రమాణస్వీకారం చేశారు. మధ్యాహ్నం అనివార్య కారణాలతో వార్డు మెంబర్ పదవికి రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో శ్రీధర్‌కు అందించారు. ఈ విషయమై ఎంపీడీవోను సంప్రదించగా.. వార్డు మెంబర్ పదవికి నగేశ్ రాజీనామా పత్రాన్ని అందించారని, రాజీనామా ఆమోదించే అధికారం తనకు లేదని, పై అధికారులకు ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.


