కాంగ్రెస్ నాయకుల నిరసన
రామకృష్ణాపూర్: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహా మీ పథకం నుంచి మహాత్మగాంధీ పేరు తొలగించడం సరికాదని డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మహాత్మాగాంధీ పేరు తొలగించినందుకు నిరసనగా రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియం వద్ద గాంధీ వి గ్రహం ఎదుట ఆదివారం కాంగ్రెస్ నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలను అందించిన మహా నేత ల కుటుంబాలను బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని రఘునాథ్‌రెడ్డి ఆరోపించా రు. గాంధీ పేరు మార్చడం సబబుకాదని పేర్కొన్నారు. కార్యక్రజుంలో పార్టీ పట్టణాధ్యక్షుడు పల్లె రాజు, నాయకులు గాండ్ల సమ్మ య్య, వొడ్నాల శ్రీనివాస్, శ్యాంగౌడ్, అజీజ్, గోపురాజం తదితరులు పాల్గొన్నారు.


