మహాసభలను విజయవంతం చేయండి
మంచిర్యాలఅగ్రికల్చర్/జైపూర్: ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర నాలుగో మహాసభలను జ యప్రదం చేయాలని టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌సింగ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద, జైపూర్ మండల కేంద్రంలో మహాసభల పోస్టర్ ఆవి ష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గద్దర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రజాఫ్రంట్ ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు. టీపీఎఫ్ మహాసభలకు అధికసంఖ్యలో హాజరు కావాలని కోరారు. నాయకులు పోశం, నందన్, సత్యనారాయణ, శంకర్, జాడి చంద్రయ్య, పోచం, ఆనంద్, మల్లయ్య, నంబన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


